విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
జమ్మలమడుగు రూరల్: నేటీ పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లోను రాణించాలని జమ్మలమడుగు ఆర్డీఓ అదిమూలం సాయిశ్రీ పేర్కొన్నారు. సోమవారం జమ్మలమడుగు ముద్దనూరు రహదారిలో ఉన్న ప్రభుత్వ బాలికల జూనియరు కళాశాలలో 69వ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో విద్యార్థులు తమ సత్తా చాటడం వల్ల వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో మంచి భవిష్య త్తు ఉంటుందన్నారు. కాగా ఇక్కడికి వచ్చిన క్రీడాకారులతో గౌరవంగా మెలగాలని ఆమె సూచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు జమ్మలమడుగు ప్రాంతంలో జరగడం గర్వ కారణం అన్నారు. అనంతరం విద్యార్థీనులు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. డీఈఓ శంషుద్దీన్, ఏపీసీ ప్రేమంత కుమార్, రాష్ట్ర పాఠశాల గేమ్స్ సెక్రటరి భానుమూర్తి రాజు, జాతీయ స్థాయి అబర్జ్వర్ జయప్రకాష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, ఎంపీడిఓ సయ్యదున్నీసా, పీఇటీలు మురళీ, హెమంబర్‌రెడ్డి, శివారెడ్డి అర్గనైజింగ్ సెక్రటరీలు ప్రసాద్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏపీ జట్టు ఓటమి
జమ్మలమడుగు: అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ వాలీబాల్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ బాలికల జ ట్టు ఓటమిపాలైంది. సోమవారం ఉదయం యూపీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. అలాగే పశ్చిమబెంగాల్ –హిమాచల్‌ప్రదేశ్ జట్ల్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్, హర్యానా– సెంట్రల్ స్కూల్స్ టీం మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్యానా జట్లు గెలుపొందాయి. జార్ఖండ్‌పై తమిళనాడు, ఛత్తీస్‌గడ్‌పై కేరళ, సైనిక స్కూల్‌పై ఉత్తరాఖండ్, గుజరాత్‌పై సీబీఎస్‌సీ, తెలంగాణపై కర్నాటక, ఎన్‌వీఎస్‌పై మహారాష్ట్ర విజయం సాధించాయి. తొలి రోజు పోటీలు రసవత్తరంగా సాగాయి.
– ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి


