అయ్యోవారలు | - | Sakshi
Sakshi News home page

అయ్యోవారలు

Jan 6 2026 7:24 AM | Updated on Jan 6 2026 7:24 AM

అయ్యో

అయ్యోవారలు

● పని చేసేది ఓ చోట.. రికార్డుల్లో పేరు మరోచోట..

కడప ఎడ్యుకేషన్‌: చాలా ఏళ్లు దూరంగా పనిచేశాం.. రోజు రానూపోనూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అలిసిపోయాం.. ఇప్పుడు బదిలీ అవుతున్నాం. ఇక కష్టాలు తీరతాయనుకున్న అయ్యవార్లు కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. బదిలీలు ముగిసి సుమారు ఏడు నెలలైనా వారి కష్టాలు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి.

● దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లు ఉపాధ్యాయులు బదిలీ అయినా రిలీవర్‌ రాక కొంతమంది అయ్యవార్లు పాత స్టేషన్ల(బడుల్లో)లో కొనసా గుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బదిలీ అయిన 175 మంది అయ్యవార్లకు ఇది తీరని రోదనగా మారింది. గతేడాది పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించింది. ఈ బదిలీల్లోనూ ఉన్న ఖాళీలలో ముందుగా మెగా డీఎస్సీ 2025లో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ప్రాధాన్యతల వారీగా భర్తీ చేస్తూ కౌన్సెలింగ్‌ను నిర్వహించింది. ఆపై మిగిలిన అయ్యవార్లకు బదిలీలు నిర్వహించింది. ఎన్నో ఆశలతో బదిలీలు అయిన కొంతమంది ఉపాధ్యాయులకు చివరకు నిరాశే మిగిలింది. నిబంధనల ప్రకారం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న పలువురు వేరే వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కొందరేమో పాఠశాల నుంచి వెళ్లేందుకు వీలు లేక అక్కడే మగ్గాల్సి వస్తోంది. కారణం అక్కడికి మరో ఉపాధ్యాయుడు వస్తేనే అక్కడ నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయుడు కదలాల్సి ఉంటుంది. అయితే ఆ ఊసే లేకపోవడంతో దాదాపు ఏడు నెలల నుంచి పాత స్థానాల్లోనే విధులను నిర్వహించాల్సి వస్తోందని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

పేరుకే బదిలీ... పని మాత్రం పాత స్థానాల్లోనే

అయోమయంలో అయ్యవార్లు

మరో నాలుగు నెలల్లో ముగియనున్న విద్యా సంవత్సరం

బదిలీ అయిన ఉపాధ్యాయులకు రికార్డుల్లో పేరు ఒక చోట ఉంటే పని మరో చోట చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీ కౌన్సెలింగ్‌లో వారికి ఉన్న సీనియారిటీని బట్టి వారు అనుకున్న చోటుకు బదిలీలయ్యారు. దీంతో సంతోషంగా పాతబడుల్లో నుంచి రిలీవై కొత్త బడుల్లో చేరారు. బడులు పునః ప్రారంభమైన తరువాత మళ్లీ సంబంధిత ఉపాధ్యాయులను రిలీవర్‌ వచ్చే దాక పాతబడుల్లోనే పనిచేయాలని పంపించారు. దీంతో చేసేదేం లేక రిలీవర్‌ వచ్చేదాక అక్కడే పనిచేసి తర్వాత వద్దామని వెళ్లారు. తరువాత వచ్చేందుకు మిగులు ఉపాధ్యా యులు లేక దీంతో వారు అక్కడే పని చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా గతంలో పనిచేసిన బడుల్లోనే పని చేస్తున్నారు. జీతం మాత్రం కొత్తగా చేరిన బడుల్లో ఉన్నట్లే తీసుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

అయ్యోవారలు1
1/1

అయ్యోవారలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement