నేడు ‘డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ’
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకూ ‘డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వినియోగదారులు నేరుగా 08562–242457 నంబర్‌కు ఫోన్ చేసి తమ విద్యుత్ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కడప సెవెన్‌రోడ్స్: స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు–2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఒకేసారి ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. చెత్త రహిత గ్రామ పంచాయతీ అనే అంశం ప్రధాన ఎజెండాతో ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిదులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో స్వచ్ఛతను నిరంతరం కొనసాగించేందుకు తీర్మానాలు ఆమోదిస్తామన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన మూడు పంచాయతీలను గుర్తించి గణతంత్ర దినోత్సవంలో గ్రామ పెద్దలను సత్కరిస్తామని వివరించారు.
కడప సిటీ: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 5 నుంచి వికసిత్ భారత్ గ్యారంజీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) వీబీ–జీ రామ్‌జీ–2025 పథకానికి సంబంధించి గ్రామసభలను నిర్వహించనున్నట్లు డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంపై గ్రామసభల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం, పథకంపై చర్చిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని 629 గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు అందరూ గ్రామ సభల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్ కు కాల్ చేయవచ్చునన్నారు.
సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఈ సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో తెలిపారు.
బి.కోడూరు: ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వై.వెంకటసుబ్బయ్యను నియమించినట్లు ముదిరాజ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోర్ల నారాయణ ముదిరాజ్ తెలిపారు. ఆదివారం విజయవాడలో జరిగిన ముదిరాజ్ మహాసభ కార్యక్రమంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనను జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొర్లనారాయణ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్‌ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బరాయుడు ముదిరాజ్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రొద్దుటూరు క్రైం: ఏపీ మెడికల్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. యూనియన్ కార్యవర్గ వార్షిక సమావేశం స్థానిక టీఎస్సార్ కల్యాణమండపంలో నిర్వహించారు. ప్రెసిడెంట్‌గా పి.నరసింహారెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌లుగా ఎంఎల్ నరసింహులు, బి.రవిప్రకాష్, సెక్రటరీగా సి.రామలింగారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. రెడ్డయ్య, వి.సూర్యపెద్దరాజు, ట్రెజరర్‌గా జె.కృష్ణ సుమంత్‌లను ఎన్నుకున్నారు. వీరితో పాటు మల్లికార్జున, గురుకృష్ణ, మాధవ, రామాంజనేయులు, చంద్ర, ఆనంద్, శ్రీకాంత్‌లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
నేడు ‘డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ’


