నిధులను వందశాతం వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

నిధులను వందశాతం వినియోగించాలి

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

జెడ్పీ సీఈఓ శోభారాణి

భువనగిరి : మంజూరైన నిధులను వంద శాతం వినియోగించాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేయడంతోపాటు పెండింగ్‌ దరఖాస్తులు, ఆడిట్‌ అభ్యంతరాలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం మంజూరైన నిధులు, పనుల పురోగతి, ఆరోగ్యం రంగం, పరిపాలన, సంక్షేమ పథకాలు, యువజన సాధికారత, సామాజిక సేవ అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ పీఆర్‌ ఇంజనీర్‌ విష్ణువర్థన్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌, డీఆర్‌ఓ జయమ్మ, డీఎంహెచ్‌ఓ ఏఓ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement