నక్షా సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

నక్షా సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

యాదగిరిగుట్ట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నక్షా సర్వే ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత పెరగడంతోపాటు భవిష్యత్‌లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో చేపట్టిన నక్షా సర్వే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకారెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే సమయంలో భూ యజమానులకు పూర్తి సమాచారం అందిస్తూ.. వారి అభ్యంతరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఆస్తికి కచ్చితమైన హద్దులను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు అధికారులు, సర్వే బృందాలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస గృహాలు, ప్లాట్ల వాస్తవ హద్దులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా నిర్ధారిస్తున్నారో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ల్యాండ్‌ అండ్‌ సర్వే అధికారిణి సుజాత, రెవెన్యూ అధికారులు, సర్వే బృందాల సిబ్బంది, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన వైద్య సేవలందించాలి

భువనగిరి : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న ప్రజారోగ్య కార్యక్రమాలు, పురోగతిపై మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య పరీక్షలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ మిషన్‌ కింద భువనగిరిని మోడల్‌ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. క్షయ వ్యాధి గుర్తింపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌, డీసీహెచ్‌ఎస్‌ సూర్యశ్రీ, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అరుణకుమారి, డీఐఓ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుమన్‌ కళ్యాణ్‌, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్స్‌ వీణ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement