ఉపాధ్యాయులకు మళ్లీ టెట్‌ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు మళ్లీ టెట్‌ టెన్షన్‌

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

భువనగిరి : టీజీటెట్‌–2026 ఫలితాలతో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు టెన్షన్‌ పడుతున్నారు. గత నెల 16 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన టీజీటెట్‌–2026 ఫలితాలు ఈ నెల 13న విడుదలయ్యాయి. ఇందులో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల్లో కేవలం 37.29 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కేంద్ర ప్రభుత్వం విధించిన టెట్‌ అర్హత తప్పసరి నిబంధనలతో అర్హత సాధించని ఉపాధ్యాయుల్లో ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది.

ఉత్తీర్ణత తప్పసరితో ఒత్తిడి

గత నెలలో జరిగిన టీజీటెట్‌–2026 పరీక్షకు 20 నుంచి 25 ఏళ్లుగా బోధన చేస్తున్న సుమారు 420 నుంచి 450 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు హాజరయ్యారు. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్లలో టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్‌లో తీర్పు వెలువరించింది.

ప్రత్యేక టెట్‌ పైనే ఆశలు

ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల భవిష్యత్‌ ఇప్పుడు ప్రత్యేక టెట్‌పై ఆధారపడి ఉంది. టెట్‌–1లో అర్హత సాధించలేకపోయిన వారికి ప్రత్యేకంగా టెట్‌–2 నిర్వహిస్తామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 21న నోటిఫికేషన్‌ విడుదల చేసి సెప్టెంబర్‌ 7 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఫ కేంద్ర నిబంధనతో ఉద్యోగ భద్రతపై ఆందోళన

ఫ ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల్లో 37.29 శాతం మంది అర్హత

ఫ టెట్‌–2 నిర్వహణకు 21న నోటిఫికేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement