బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెంలో రెండు రోజుల క్రితం వాటర్ ట్యాంక్‌లో నీళ్లు తాగి అస్వస్థతకు గురైన 12 మంది విద్యార్థులు ఆసుపత్రిలో వైద్యం పొందుతూ కొలుకుని ఆదివారం క్షేమంగా ఇంటికి చేరినట్లు కార్యదర్శి సున్నం కృష్ణ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
కై కలూరు: ప్రసిద్ధి చెందిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, చిన్న, పెద్ద తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.72,822 ఆదాయం వచ్చిందని చెప్పారు.


