భీమవరం: 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవాలను శనివారం భీమవరంలోని అన్ని కోర్టుల ప్రాంగణంలో నిర్వహించారు. 3వ అదనపు జిల్లా న్యా యమూర్తి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు త్రిభాషా డిక్షనరీలు పంచారు. పోక్సో కోర్టు వద్ద సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం.సుధారాణి జాతీయ జెండాను ఎగురవేశారు. 1వ అదనపు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తి పి.హనీష జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో జెండాను ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) సి.రమ్య ఎగురవేశారు. న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్ (న్యూటన్), ప్రధాన కార్యదర్శి బడుగు అశోక్‌బాబు, న్యాయవాదులు, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


