రేంజ్‌లో మావోయిస్టుల బెడద లేదు
తాడేపల్లిగూడెం రూరల్: ఛత్తీస్‌ఘఢ్ నుంచి మావో యిస్టులు తాత్కాలిక షెల్టర్ నిమిత్తం ఏలూరు వచ్చారని, రేంజ్ పరిధిలో మావోయిస్టుల బెడద లేదని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలపై పూర్తి సమాచారం ఉందని, ఇక్కడకు రాగానే వారిని అరెస్టు చేశామన్నారు. గతంలో ఏమైనా కేసుల్లో ఉన్నారా? అనే దానిపై విచారిస్తున్నామన్నారు. ఐదేళ్లుగా గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు లేవన్నారు. నిందితుల పై నిఘా పెట్టామన్నారు. రాత్రి సమయాల్లో డ్రంక న్ డ్రైవ్, ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, లారీ డ్రైవర్ల ఫేస్ వాష్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ న్నారు. డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందన్నారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతలు ప్ర శాంతంగా ఉన్నాయన్నారు. రూరల్ స్టేషన్ రికార్డులు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, డీఎస్పీ డి.విశ్వనాథం, సీఐలు ఆదిప్రసాద్, బీబీ రవికుమార్, ఎస్సై జేవీఎన్ ప్రసాద్ ఉన్నారు.


