మహిళపై హత్యాయత్నం
కై కలూరు: తనతో సహజీవనం చేసే మహిళ 6 నెలలు నుంచి దూరంగా ఉండటంతో కసి పెంచుకున్న వ్యక్తి ఆమైపె హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కై కలూరులో మంగళవారం జరిగింది. కై కలూరు పట్టణ సీఐ ఏవీఎస్.రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం కై కలూరు మండల శీతనపల్లి గ్రామానికి చెందిన చిన్నం ఏసేబు(పండు, 50) డ్రెవర్‌గా పనిచేసేవాడు. వివాహం జరిగిన కొద్ది కాలానికే భార్య, పిల్లలతో విడిపోయాడు. ఈ నేపథ్యంలో హైదరాబాదు మైబాద్‌లో లలిత(45)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే లలితకు మల్లిఖార్జునరావుతో వివాహం జరిగింది. వీరికి పాప. లలితను ఏసేబు 15 ఏళ్ల క్రింతం శీతనపల్లి తీసుకొచ్చి సహజీవనం చేస్తున్నాడు. లలిత కుతూరు ఆమెతోనే ఉంటూ చదువుకుంటుంది. ఏసేబు మద్యానికి బానిసై గొడవలు చేస్తుండడంతో ఆమె ఆరు నెలల నుంచి అతనికి దూరంగా కై కలూరు ఇస్లాంపేటలో బంధువుల ఇంటి వద్ద నివాసముంటుంది. మంగళవారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లి తన జీవితాన్ని నాశనం చేశావంటూ కొబ్బరి బొండాలు నరికే కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె కుడి చేతిని అడ్డుపెట్డడంతో చేతి వేళ్ల మధ్య నుంచి సుమారు 4 అంగుళాల లోతుకు తెగింది. కూతురు, బంధువులు గాయపడిన లలితను కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. లలిత ఫిర్యాదు మేరకు కేసు టౌన్ ఎస్‌ఐ ఆర్.శ్రీనివాస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


