సీజన్‌లో ఖాళీగా ఉంటున్నాం
నేను చిన్నప్పటి నుంచి సముద్రంలో బోటుపై వేట సాగిస్తాను. ఇప్పుడు మాకు సముద్రంలో మంచి సీజన్. ఇలా వల వేశామంటే అలా చేపలు పడతాయి. అయితే తుపాన్ల కారణంగా బోట్లు వెళ్లడంలేదు. దీంతో సీజన్‌లో ఖాళీగా ఉంటున్నాము. –తిరుమాని నాగరాజు, మత్స్యకార్మికుడు, నరసాపురం
మొన్నటి నెలలో బోటు వేసుకుని వేటకు వెళితే తుపాను కారణంగా వెంటనే తిరిగి రావాల్సి వచ్చింది. మా ఓనర్ మళ్లీ బోటు సముద్రంలోకి పంపలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కవ రోజులు ఖాళీగా ఉండాల్సి రావడంతో అప్పులు చేసుకుని తినాల్సి వస్తోంది. – టి.ఏడుకొండలు, వేములదీవి
కేవలం వేట నిషేధం సమయంలో ఇచ్చే డబ్బులే కాకుండా తుపాన్ల కారణంగా ఖాళీగా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం ఏదో రకంగా సాయం అందించి మమ్మల్ని ఆదుకోవాలి. మాకు సముద్రంలో వేట తప్ప మరో పని చేతకాదు.
– కె.ఏసుబాబు, పేరుపాలెం
సీజన్‌లో ఖాళీగా ఉంటున్నాం
సీజన్‌లో ఖాళీగా ఉంటున్నాం


