మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదని.. టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పిలునిచ్చిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ఏలూరు నియోజకవర్గంలో పెద్దెత్తున చేపడుతున్నారు. 46వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ మైనార్టీ వింగ్ నాయకులు రియాజ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సంతకాల సేకరణ చేపట్టారు. ఏలూరు సమన్వయకర్త జేపీ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ముఖ్యంగా రైతుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని తెలిపారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిలో 10 మెడికల్ కాలేజీల భవన నిర్మాణాల చేయలేకపోవడం టీడీపీ నేతలు చేతగానితనానికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, లీగల్ సెల్ ఏలూరు అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, ఆర్‌టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ బాబు, పీ.రాజేష్, సముద్రాల చిన్ని, కొల్లిపాక సురేష్, తులసీ, ఎండీ రుబీనా బేగం, సాయి, రాము, బండ్లమూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు.


