ఉంగుటూరు: కై కరం షష్ఠి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఆరు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైస్కూలు గ్రౌండ్‌లో షాపుల కోసం ఏర్పాట్లు చేశారు. తహసీల్దారు పూర్ణచంద్ర ప్రసాద్, వీఆర్వో ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై సూర్య భగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గుడి ప్రాంగణంలో వైద్య సిబ్బందితో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచి కల్యాణం అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెనన్స్ హాలు నుంచి పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, అందరికీ ఇల్లు, రోడ్డు ఆక్రమణలు, పీజీఆర్‌ఎస్, అక్రమ లేఅవుట్లు, తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. అందరికీ ఇళ్లు సర్వే కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం జిల్లాలోని మందుగుండు సామగ్రి తయారీదారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు సామగ్రి తయారుచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తయారీ కేంద్రాలలో 15 కేజీలకు మించి మందుగుండు సామగ్రి ఉండకూడదన్నారు.
భీమవరం: ఏలూరు ఆర్టీసీ పెట్రోల్ బంకులో అవినీతి కుంభకోణంలో సంబంధం లేని నలుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం భీమవరంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్మోహన్‌రాయ్, యూనియన్ జిల్లా కార్యదర్శి రాయుడు మాట్లాడుతూ అవినీతి జరిగిన రూ.82 లక్షలు వసూలు పేరుతో ఎలాంటి విచారణ చేయకుండా కొంతమంది ఉద్యోగుల దగ్గర బలవంతంగా సొమ్ము రికవరీ చేసి అసలు సంబంధం లేని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు ఎంఎస్ రావు వంటివారిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అధికారులతో విచారణ చేయించి అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఽకార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు వాసుదేవరావు, నాయకులు ఆంజనేయులు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఉంగుటూరు: సీఎం చంద్రబాబు ఉంగుటూరు మండలం గొల్లగూడెం డిసెంబరు 1న పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. గొల్లగూడెం సూర్య స్కూలు ప్రాంగణంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిపేందుకు నిర్ణయించారు. దాని ఎదురుగా హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.
కై కరం తిరునాళ్లకు ఏర్పాట్లు
కై కరం తిరునాళ్లకు ఏర్పాట్లు
కై కరం తిరునాళ్లకు ఏర్పాట్లు


