ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

Nov 26 2025 11:10 AM | Updated on Nov 26 2025 11:10 AM

ప్రభు

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

సంస్థాగతంగా బలోపేతం అన్ని వర్గాలనూ మోసం చేశారు యువతను మభ్యపెట్టారు యువత పాత్ర కీలకం యువశక్తితో ఏదైనా సాధ్యం యువత కష్టపడి పనిచేయాలి

యువజనోత్సాహం

జక్కంపూడి రాజా

వైఎస్సార్‌సీపీ యువజన విభాగాన్ని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో క్రియాశీలక యువజన నాయకులతో పార్టీ అభివద్ధికి కృషి చేస్తాం. కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై పోరాటాలు, ఉద్యమాలకు యువత సిద్ధంగా ఉన్నారు.

కారుమూరి సునీల్‌

రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏడాది కావస్తున్నా అసెంబ్లీల్లో ప్రస్తావన గానీ, బడ్జెట్లో కేటాయింపులు గానీ చేయలేదు. అబద్ధపు హామీలతో పబ్బం గడుపుకుంటున్న కూటమి నేతలకు గుణపాఠం చెప్పేందుకు యువత ఎదురు చూస్తోంది.

ముదునూరి మురళీ కృష్ణంరాజు

యువతను మభ్యపెట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. 20 లక్షలు ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి అని హామీలు ఇచ్చి చంద్రబాబు యువతను మోసం చేశారు. జగనన్‌మోహన్‌్‌ రెడ్డి పిలుపునందుకుని అన్ని ఉద్యమాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటోంది. మళ్లీ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి,

కారుమూరి నాగేశ్వరరావు

మన నాయకుడు జగన్‌ మాట ఇస్తే తప్పే మనిషి కాదు. పార్టీలో యువతకే ప్రాధాన్యత కల్పిస్తారు. దోచుకో.. దాచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన ఉంది. అప్పుడు జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల మార్కెట్‌లో వ్యాపారాలు జరిగేవి. జగన్‌ లేకపోవడంతో వ్యాపారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మళ్లీ వడ్డీలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చేశారు.

ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌

యువత తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలరు, అధికారంలోకి తీసుకురాగలరు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్‌లు చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షనన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. యువతంతా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి.

కొట్టు నాగేంద్ర, సీఈసీ సభ్యుడు

యువత దశ, దిశగా మారి పార్టీని బలోపేతం చేయాలి. 2029లో జగన్‌మోహన్‌ రెడ్డి మళ్లీ సీఎం అవ్వడానికి యువత కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. ఏడాదిన్నరలో ఏ పథకం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. వితంతు పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పార్టీ కష్టకాలంలో బాగా పనిచేసి 2029 ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి.

సాక్షి, భీమవరం: చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు యువజన విభాగం సిద్ధంగా ఉందని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. ఆ దిశగా భవిష్యత్‌ కార్యాచరణ చేస్తున్నట్టు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాల యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశం పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్‌్‌ హాలులో మంగళవారం జరిగింది. యువజన విభాగం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌ అధ్యక్షతన జరిగిన సభలో యువజన విభాగం సంస్థాగతంగా బలోపేతానికి, భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని రాజా సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం ఏదోరకంగా ప్రజలను మోసగించడం, మభ్యపెట్టడం చంద్రబాబు నైజమన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి సూపర్‌ సిక్స్‌ పేరిట రాష్ట్ర ప్రజల ఓట్లు దండుకుని ప్రజలకు మొండిచేయి చూపించారన్నారు. ఏడాదిన్నరైనా ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వాగ్దానాల ఊసే లేదన్నారు. అసెంబ్లీలో వాటి ప్రస్తావన గాని, బడ్జెట్‌లో కేటాయింపులు గాని లేవన్నారు.

రైతులు, మహిళలు, యువతను మోసం చేశారు

యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కారుమూరి సునీల్‌ మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతను ఈ ప్రభుత్వం ఎంతో మోసం చేసిందన్నారు. తల్లికి వందనం అరకొరగా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారని, ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారని విమర్శించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎస్‌ఈసీ సభ్యుడు కొట్టు నాగేంద్ర, యువజన విభాగం ఏలూరు, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అధ్యక్షులు కామిరెడ్డి నాని, పిల్లి సూర్యప్రకాష్‌, కంటమనేని రమేష్‌, రాగిరెడ్డి అరుణకుమార్‌, సంచార జాతుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పెండ్ర వీరన్న, యువజన విభాగం నియోజకవర్గ, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్‌: తణుకు వేదికగా జరిగిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సమావేశంలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన యువ నేతలతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్షేత్ర స్థాయి నుంచి సంస్థాగతంగా పూర్తి స్థాయిలో యువజన విభాగం బలోపేతానికి, పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపుమేరకు కార్యక్రమాల విజయవంతానికి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

క్షేత్రస్థాయి నుంచి యువజన విభాగం బలోపేతమే లక్ష్యం

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి

తణుకులో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం1
1/8

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం2
2/8

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం3
3/8

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం4
4/8

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం5
5/8

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం6
6/8

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం7
7/8

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం8
8/8

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement