మేడపాడు హోమ్‌కు బాలిక తరలింపు
పెంటపాడు: ‘బాలికపై సంరక్షకురాలి ఘాతుకం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారు లు స్పందించారు. గణపవరం ప్రాజెక్టు సీడీపీఓ టీఎల్ సరస్వతి, భీమవరానికి చెందిన ఐసీపీఎస్ సోషల్ వర్కర్ జేమ్స్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు దుర్గాభవాని, సుజాత సీడబ్ల్యూజీ కమిటీ సభ్యులు పెంటపాడులో నానమ్మ వద్ద ఉన్న బాధిత బాలిక గోండి సంతోషిణిని కలిశారు. మేడపాడులోని సీడబ్యూసీ హోమ్, హాస్టల్‌కు తరలించారు. సంతోషిణి భ విష్యత్ ఉన్నతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామి ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
కైకలూరు: ఎటువంటి బూతు పదాలు ఉపయోగించకుండా సోషల్ మీడియాలో చిన్నపోస్టు పెట్టినందుకే కైక లూరు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శింగంశెట్టి రాముపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసు స్టేషన్‌కు పిలిపించడం అన్యాయమని పార్టీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ ఘటనతో టీడీపీకి అభద్రతభావం ఉన్నట్టు తెలుస్తుందన్నారు. ప్రశాంత రాజకీయాలను టీడీపీ చేయాలని, వైఎస్సార్‌సీపీ నాయకులను అణచివేస్తే తిరగబడతామని హెచ్చరించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్‌ఎస్ అర్జీలను అధికారులు స్వయంగా పిటిషనర్‌తో మా ట్లాడి పరిష్కరించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అ క్టోబర్, నవంబర్ నెలల్లో పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలపై నోడల్ టీం ఫ్రీ ఆడిట్ నిర్వహించి గుర్తించిన అర్జీల పరిష్కారంలో లోపాలపై అధికారులతో సమీక్షించారు.
ఏలూరు టౌన్: ఏలూరు జీజీహెచ్‌లో చెవి, ముక్కు, గొంతు విభాగం వైద్యనిపుణులు అరుదైన రెండు శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేశారు. రోగులు సంపూర్ణంగా సమస్య నుంచి కోలుకుంటున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు తెలిపారు. గోపన్నపాలేనికి చెందిన వెంకట సత్యనారాయణ (36)కు మొ ఖం ఎడమవైపు వాపుతో కనుగుడ్డు ఉబ్బి ముందుకు పొడుచుకుని వచ్చింది. కనీసం చూడలేని స్థితిలో ఉండగా వైద్యులు పరీక్షించి సైనోనేసల్ క్యాన్సర్‌గా గుర్తించారు. ఈనెల 18న శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకి చెందిన వీరాస్వామి (56) గొంతులో ఇబ్బందిగా ఉండటంతో గొంతు బొంగురుపోయింది. ఎండోస్కోపీ ద్వారా స్వరపేటికపై ఉన్న కణితిని గుర్తించి శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించారని ఈఎన్‌టీ హెచ్‌ఓడీ డాక్టర్ డి.సుధ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 24న పోరాట దీక్ష చేపట్టనున్నట్టు సమగ్ర శిక్ష రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నోటీసులను గురువారం సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.పంకజ్‌కుమార్, డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మలకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల హెచ్‌ఆర్ పాలసీ, ఎంటీఎస్, వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్ర భుత్వం స్పందించకుంటే డిసెంబర్ 10న సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఆయా రోజుల్లో జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సామూహిక సాధారణ సెలవు ఇవ్వాలని కోరామని, లేకుంటే ఉ ద్యోగులు సీఎల్ పెట్టుకుని విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు.
మేడపాడు హోమ్‌కు బాలిక తరలింపు
మేడపాడు హోమ్‌కు బాలిక తరలింపు
మేడపాడు హోమ్‌కు బాలిక తరలింపు


