ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు
భీమవరం: సార్వా సీజన్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యే క శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సార్వా సీజన్ ధాన్యం కొనుగోలు, పీజీఆర్‌ఎస్ పెండింగ్ ఫిర్యాదుల ప్రగతి, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, అర్హులందరికీ ఇ ళ్లు, రీసర్వేకు వెబ్ ల్యాండ్‌లో చేయాల్సిన సవరణ తదితర అంశాలపై అధికారులతో స మీక్షించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని పరికరాలను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డీటీలు ఎం.సన్యాసిరావు, నాగమణి, ఈడీఎం కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి


