న్యూస్‌రీల్
వరంగల్
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ముసాయిదా జాబితాలో 6,78,540 మంది ఓటర్లు
అభివృద్ధి పనులకు ఆమోదం!
హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది.
ఇక నోటీసులు
అభ్యంతరాలు
సాక్షి, వరంగల్: జిల్లాలో 7,76,953 మంది ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 6,78,540 మంది ఓటర్లున్నట్టుగా సోమవారం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు. అయితే ఈ డిజిటలైజేషన్ అయిన ఓట్లలోనూ 2002 ఓటరు జాబితాకు, ప్రస్తుతం ఉన్న జాబితాలో పేరు తప్పుగా నమోదై ఉన్నా, ఇంటి పేరు, తల్లి, తండ్రి పేర్లు, తల్లిదండ్రుల వయస్సుతో పిల్లల వయస్సు సరిపోలకపోవడం వంటి తదితర వ్యత్యాసాలున్న వారు 1,50,183 మంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీరితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓటు, జిల్లాలోనే ఉండి ఫారాలు సమర్పించని వారికి బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) నోటీసులు జారీ చేస్తారు. జిల్లాలో మొత్తంగా చూసుకుంటే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని 98,413 మంది ఓటర్లున్నారు. ఈ ఓటర్లను ‘సర్’లో ఆన్ కలెక్టబుల్ పేరుతో నమోదు చేశారు. వీరిలో 21,933 మంది డెత్, 6,669 మంది అన్‌ట్రేసబుల్ /అబ్సెంట్, 55,751 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారు, 129 మంది ఇతరులు, 13,931 మంది ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదుగా ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. నోటీసులందుకున్న ఓటర్లు ఫారం–6 ద్వారా ఎన్నికల సంఘం సూచించిన పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. సరిగా ఉంటే తిరిగి వారి పేర్లను జాబితాలో నమోదు చేస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే తుది జాబితాలో ప్రచురిస్తారు. మిగతా పేర్లనీ జాబితా నుంచి తొలగిస్తారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అక్టోబర్ 15 వరకు వాటి పరిష్కారం చేపట్టి అక్టోబర్ 19న తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అలాగే ఈ ముసాయిదా జాబితాపై వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిశీలించి అర్హత ఉన్నవారి వివరాలను సరిచేయనున్నారు.
సర్వీస్ ఓటర్లు 642 మంది
జిల్లా ముసాయిదా వివరాల్లో 642 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు. వీరిలో 597 మంది పురుషులు, 33 మంది మహిళలు ఉన్నారు. ఇతరుల కేటగిరీలో ఎవరూ లేరు. సర్వీస్ ఓటర్లలో అత్యధికంగా నర్సంపేటలో 366 మంది ఉండగా, వర్ధన్నపేటలో 187, వరంగల్ తూర్పులో 89 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 35 మంది ఉన్నారు. వీరిలో 28 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. నర్సంపేటలో ఎనిమిది మంది, వరంగల్ తూర్పులో 19 మంది, వర్ధన్నపేటలో ఎనిమిది మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లుగా నమోదయ్యారు.
2002 ఓటరు జాబితాతో వ్యత్యాసమున్న 1,50,183 మందికి నోటీసులు
ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని 98,413 మంది విషయంలోనూ చర్యలు
సెప్టెంబర్ 16 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 15వ తేదీ వరకు పరిష్కారం చేపట్టి 19న తుది జాబితా
నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితా వివరాలు
నియోజకవర్గం పీఎస్‌లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
నర్సంపేట 288 1,08,654 1,13,251 8 2,21,913
వరంగల్ తూర్పు 242 1,01,711 1,07,873 62 2,09,646
వర్ధన్నపేట 286 1,21,073 1,25,894 14 2,46,981


