లోటు వర్షపాతమైనా..పత్తికి సై | - | Sakshi
Sakshi News home page

లోటు వర్షపాతమైనా..పత్తికి సై

Aug 18 2026 9:14 AM | Updated on Aug 18 2026 9:14 AM

సాక్షి, వరంగల్‌: వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంటలసాగుపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. జిల్లాలో అత్యధికంగా సాగు చేద్దామనుకున్న వరి సాగు వెనుకబడగా, పత్తి మాత్రం ముందంజలో ఉంది. 1,25,000 ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 53,315.08 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. ఇక 1,10,200 ఎకరాల్లో సాగు చేద్దామనుకున్న పత్తి 1,19,459.88 ఎకరాల్లో సాగు చేశారు. అయితే వరి సాగు 46.65 శాతం ఉండగా, పత్తి సాగు 108.40 శాతంగా నమోదైంది. మొక్కజొన్న ఎనిమిది వేల ఎకరాలకు గానూ 8,188.87 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పంటల విస్తీర్ణాన్ని పరిశీలిస్తే గీసుకొండ, దుగ్గొండి, నెక్కొండ, సంగెం, నల్లబెల్లి తదితర మండలాల్లో పత్తి అత్యధికంగా సాగు చేయగా, రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో వరి విస్తీర్ణం గణనీయంగా ఉంది. భూముల స్వభావం, నీటి లభ్యత, గత సాగు విధానం, వర్షాధార పరిస్థితులు ఈ పంటలపై ప్రభావాన్ని చూపాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు 2,75,500 ఎకరాల్లో పంట సాగు అంచనా వేస్తే ఈ నెల 10వ తేదీ నాటికి 13 మండలాల్లో కలిపి 1,88,045.94 ఎకరాల్లో వానాకాలం పంటలు మాత్రమే సాగయ్యాయి. అంటే ఇప్పటివరకు 68.26 శాతం సాగవగా, ఇంకా 31.74 శాతం సాగు కావాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా రాయపర్తి మండలంలో 26,573.32 ఎకరాలు సాగవగా, అత్యల్పంగా వరంగల్‌ మండలంలో 1,858.87 ఎకరాల్లో సాగు నమోదైంది. ఈ నెలాఖరు నాటికి వర్షాలు కురిస్తే మిగిలిన ఎకరాల్లో పంటల సాగు చేసే అవకాశం ఉంది.

మండలాల వారీగా సాగు వివరాలు

చెన్నారావుపేట మండలంలో పత్తి 11,275 ఎకరాలు, వరి 2,747, మొక్కజొన్న 650, పెసర 80, కంది 40, వేరుశనగ 35, పసుపు 12, ఆయిల్‌పామ్‌ 421.08 ఎకరాల్లో సాగయ్యాయి.

దుగ్గొండి మండలంలో పత్తి 13,995, మొక్కజొన్న 921, పెసర 649, వరి 802, వేరుశనగ 59, కంది 53, పసుపు 295, సోయాబీన్‌న్‌ 12, ఆయిల్‌పామ్‌ 485.88 ఎకరాల్లో సాగయ్యాయి.

ఖానాపురం మండలంలో వరి 4,859 ఎకరాలు, పత్తి 3,297, మొక్కజొన్న 1,378, ఆయిల్‌పామ్‌ 357.17 ఎకరాల్లో సాగు నమోదైంది. కంది 2, పెసర 8, పసుపు 2 ఎకరాల్లో ఉన్నాయి.

నల్లబెల్లి మండలంలో పత్తి 12,826.20 ఎకరాలతో ప్రధాన పంటగా ఉంది. మొక్కజొన్న 1,890.87, వరి 1,900, పెసర 249.20, వేరుశనగ 112, కంది 32, సోయాబీనన్‌ 12, ఆయిల్‌పామ్‌ 182.94 ఎకరాల్లో సాగయ్యాయి.

నర్సంపేట మండలంలో పత్తి 7,521 ఎకరాలు, మొక్కజొన్న 1,032, వరి 1,139, వేరుశనగ 446, పెసర 270, సోయాబీన్‌ 252, ఆయిల్‌పామ్‌ 322.21 ఎకరాల్లో సాగయ్యాయి. పసుపు 50, కంది 33 ఎకరాల్లో ఉన్నాయి.

నెక్కొండ మండలంలో పత్తి 12,308 ఎకరాలు, వరి 2,913, మొక్కజొన్న 625, ఆయిల్‌పామ్‌ 359.76 ఎకరాల్లో సాగయ్యాయి. పసుపు 105, సోయాబీన్‌ 8, కంది 14, పెసర 19 ఎకరాల్లో ఉన్నాయి. ఎరమ్రిర్చి 2 ఎకరాల్లో సాగైంది.

గీసుగొండ మండలంలో పత్తి 14,673, వరి 862, మొక్కజొన్న 202, పెసర 86, కంది 56, సోయాబీన్‌ 51, పసుపు 115, ఆయిల్‌పామ్‌ 1.20 ఎకరాల్లో సాగైంది.

ఖిలా వరంగల్‌ మండలంలో పత్తి 3,405 ఎకరాలు, వరి 634, పెసర 271, మొక్కజొన్న 229, కంది 45, వేరుశనగ 4 ఎకరాల్లో సాగయ్యాయి.

పర్వతగిరి మండలంలో వరి 6,041, పత్తి 9,195, మొక్కజొన్న 119, కంది 11, పెసర 29, వేరుశనగ 4, ఎరమ్రిర్చి ఒక ఎకరం, పసుపు 3 ఎకరాల్లో సాగయ్యాయి.

రాయపర్తి మండలంలో వరి 16,020, పత్తి 9,829, ఆయిల్‌పామ్‌ 456.32, మొక్కజొన్న 162, కంది 50, పెసర 46, వేరుశనగ 8, పసుపు 2 ఎకరాల్లో సాగయ్యాయి.

సంగెం మండలంలో పత్తి 12,495 ఎకరాలు, వరి 1,942, మొక్కజొన్న 652, పసుపు 158, పెసర 104, కంది 41, సోయాబీన్‌ 15, ఆయిల్‌పామ్‌ 55.68 ఎకరాల్లో సాగయ్యాయి.

వరంగల్‌ మండలంలో పత్తి 1,438.68 ఎకరాలు, వరి 254.08, మొక్కజొన్న 64, ఆయిల్‌పామ్‌ 47.46 ఎకరాల్లో ఉన్నాయి. పెసర 28.38, కంది 18.27, సోయాబీన్‌్‌ 8 ఎకరాల్లో సాగయ్యాయి.

వర్ధన్నపేట మండలంలో వరి 13,202, పత్తి 7,202, మొక్కజొన్న 264, ఆయిల్‌పామ్‌ 275.56 ఎకరాల్లో సాగయ్యాయి. కంది 63, పెసర 34, నువ్వులు 5, ఎర్రమిర్చి 5, పసుపు 2 ఎకరాల్లో సాగయ్యాయి.

వానాకాలం సీజన్‌లో లక్ష్యానికి మించి 1,19,459.88 ఎకరాల్లో సాగు

53,315.08 ఎకరాల్లో వరి సాగుతో 46.65 శాతంగా నమోదు

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు

68.26 శాతమే సాగు

ఈ నెలాఖరు నాటికి వర్షాలు కురిస్తే మిగిలిన భూముల్లో సాగయ్యే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement