న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 166 దరఖాస్తులు రాగా రెవెన్యూ 52, జీడబ్లుఎంసీ 26, హౌసింగ్, 12, డీఆర్‌డీఓ 22, ఇతర శాఖలకు సంబంధించి 54 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వం మండలస్థాయిలో ప్రజావాణిని నిర్వహిస్తుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, పెన్షన్, తదితర సమస్యలపై మండలపరిధిలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు సంధ్యారాణి, వై.వీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ నాగపద్మజ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతులు ఇలా..
● నర్సంపేట పట్టణం రాజుపల్లి గ్రామానికి చెందిన ఎస్. మల్లమ్మ వృద్దాప్య పింఛన్ మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు.
● వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ విన్నవించారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
గ్రీవెన్స్‌లో 166 దరఖాస్తులు


