గీసుకొండ: హారతి ఇస్తున్న అర్చకుడు
సుదర్శనాచార్యులు
ఉర్సు నాగమయ్య దేవాలయంలోని
పుట్టలో పాలు పోస్తున్న మహిళలు
గీసుకొండ: జిల్లాలో భక్తులు శ్రావణమాసం, శుక్లపక్ష పంచమి సందర్భంగా నాగుల పంచమిని సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కాలసర్ప దోశం తొలగిపోవాలని, సంతాన భాగ్య కలగాలంటూ మహిళలు ఆలయాల్లోని పుట్టలో పాలు పోసి మొక్కుకున్నారు. గీసుకొండ మండలం ఊకల్‌హవేలిలోని ప్రసిద్ధ నాగ సుభ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు గర్భాలయాన్ని పూలతో సుందరంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


