అంకితభావంతో ఉన్నత స్థానాలకు.. | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో ఉన్నత స్థానాలకు..

Aug 18 2026 9:14 AM | Updated on Aug 18 2026 9:14 AM

కేయూ క్యాంపస్‌: అంకితభావం, క్రమశిఽక్షణ, దృఢసంకల్పం విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరవచ్చని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమవారం కేయూలో ఆడిటోరియంలో కో–ఎడ్యుకేషనల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌లో ప్రవేశాలు పొందిన నూతన విద్యార్థులకు సోమవారం ఓరియంటేషన్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకుని సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్‌ కోల ఆనందకిషోర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం, నైతిక విలువలు, మానవీయ దృక్పథం సమన్వయమే సమగ్ర విద్యకు పునాది అన్నారు. కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.రమణ, వివిధ విభాగాల అధ్యాపకులు రాధిక, సుమలత, వి.మహేందర్‌, ఆసీం ఇక్బాల్‌, విజయ్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

కేయూ ఓఎస్డీ వెంకట్రాంరెడ్డి

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఓరియంటేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement