వరంగల్ సీపీ శ్వేత
వరంగల్ క్రైం: పోలీస్ అధికారుల సంఘం సి బ్బందికి అండగా నిలవాలని వరంగల్ పోలీ స్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. ఇటీవల ఎన్నికై న నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం సీపీ ఎన్.శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి మొక్కలు అందజేశారు. ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు నూతన కార్యవర్గ సభ్యులను సీపీకి పరిచయం చేశారు. అనంతరం ఆమె నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంఘం స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సదయ్యతో పాటు నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


