హన్మకొండ అర్బన్: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి గా బండి పల్లవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నూతనంగా డీపీఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన పల్లవికి పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం సెప్టెంబర్ 19న హనుమకొండలోని పాత పెన్షన్, పీఆర్సీ సాధన సభ నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ తెలిపారు. నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘం భవన్‌లో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా పాత పెన్షన్, పీఆర్సీ సాధన సభ హనుమకొండలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు రామునాయక్ పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ టి.యాదగిరిరావు సూచించారు. కేయూలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మానవ వనరుల విభాగాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడారు. సమావేశంలో విభాగాధిపతి పి.శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు ఎ.శ్రీనివాసులు, చీకటి శ్రీను, ఉమాశంకర్, దేవేంద్రచారి విద్యార్థులున్నారు.
న్యూశాయంపేట: టైలరింగ్‌లో ప్రావీణ్యం ఉన్న నిరుద్యోగులకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. డీఆర్డీఓ కార్యాలయంలో నిరుద్యోగులు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతీ సోమవారం, గురువారాల్లో ఉదయం 11 గంటలకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును సంప్రదించి కూడా ఉపాధి పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.
కేయూ క్యాంపస్: అధునాతన సాంకేతిక సాధనాల వినియోగం అత్యంత కీలకమని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్ ఆధ్వర్యంలో కేయూ కంప్యూటర్ సెంటర్‌లో వారం రోజుల వర్క్‌షాపును సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక పరిశోధనలో డేటాను శాసీ్త్రయంగా విశ్లేషించి ప్రయోగాత్మక ఫలితాలను మరింత కచ్చితంగా వినియోగించాలని కోరారు. పుణేలోని అడ్వకేంట్ ఇన్ఫర్మేటిక్స్ సీఈఓ సురోజిత్‌సాధు, ఇతర బాధ్యులు షమ్షీర్‌సింగ్, దీపక్‌శర్మ, రూసా నోడల్ అధికారి ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, వర్క్‌షాప్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, కో కోఆర్డినేటర్ డాక్టర్ శాస్త్రి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


