హసన్‌పర్తి : మండలంలోని గోపాలపురం చెరువు పునరుద్ధరణ పనుల్లో భారీ అవకతవకలు చోటు చే సుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ని బంధనలను పక్కన పెట్టి అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేశారన్న విమర్శలున్నాయి. పూడికతీత పనుల పేరుతో ఏకంగా మొరం వ్యాపారానికి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.పది కోట్ల మేరకు చెరువు నుంచి మొరం దోపిడీ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గోపాలపురం చెరువు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రి టర్నింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.4 కోట్లు, పూడికతీత పనుల కోసం రూ.కోటి విడుదల చేసింది మూడు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెరువు అభివృద్ధి పనులు చేపట్టారు.
పూడికతీత పేరిట మొరం దందా
ఇదిలా ఉండగా.. చెరువులో పూడికతీత పేరుతో సదరు కాంట్రాక్టర్ మొరం దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు 1.5 మీటర్ల మేరకు పూడికతీయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సదరు కాంట్రాక్టర్ 8 మీటర్ల నుంచి 10 మీటర్ల లోతు వరకు చెరువును తోడేశాడు. తొలుత రాత్రి వేళ ఈ వ్యాపారం సాగించాడు. ప్రస్తుతం నిరంతరంగా మొరాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ప్రతీరోజు 100 నుంచి 200 టిప్పర్ల మొరం వివిధ ప్రాంతాలకు తరలివెళ్తోంది. ఒక్కోటిప్పర్ మొరం మార్కెట్‌లో రూ.10వేలు నుంచి 12 వేల వరకు విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నగరంలో కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, విల్లాలకు ఇక్కడే నుంచి మొరం తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి అండతోనే మొరం దందా సాగుతోందని ఆరోపణ లు వ్యక్తమవుతున్నాయి. చెరువు నుంచి మొరం తరలిస్తున్నారని లిఖితపూర్వకంగా ఫి ర్యాదు చేసినా స్పందించడం లేదని వినిపిస్తున్నాయి.
అస్థిత్వం కోల్పోయిన చెరువు
గోపాలపురం చెరువు అస్థిత్వాన్ని కోల్పోయింది. ప్రస్తుతం చెరువును క్వారీగా మార్చారు. చెరువు పునరుద్ధరిస్తే భవిష్యత్ బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.
గోపాలపురం చెరువు ధ్వంసం
రూ.10 కోట్ల విలువచేసే
మొరం అమ్మకాలు
అభివృద్ధి పేరుతో వ్యాపారం


