రీ–సర్వేతో భూ సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రీ–సర్వేతో భూ సమస్యలు పరిష్కారం

Jul 31 2026 12:04 AM | Updated on Jul 31 2026 12:04 AM

వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీ–సర్వే పూర్తయితే భూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. గురువారం మండలంలోని కొర్లకుంటలో నిర్వహిస్తున్న భూ రీ–సర్వేను ఆయన పరిశీలించి సర్వేయర్లకు పలు సూచనలు, సలహాలిచ్చారు. గ్రామంలోని రైతుల భూములను సమగ్రంగా సర్వే చేస్తామని.. మోఖాపైన ఉండి పట్టాదారు పాసు పుస్తకాల్లో రాని రైతుల వివరాలు సేకరిస్తామని, ప్రభుత్వ భూములు కూడా గుర్తిస్తామని వివరించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ఖాజా మైనుద్దీన్‌, మాజీ ఎంపీపీ కమలేశ్వర్‌రావు, ఆర్‌ఐ రాములు, పలువురు రైతులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

వీపనగండ్ల: ముసురు వర్షాలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా నోడల్‌ అధికారి డా. వంశీకృష్ణ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకోవచ్చన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఫై డే.. డ్రై డే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మురుగుకుంటల్లో దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయుష్‌ వైద్యులు డా. శ్వేత, డా. కరుణశ్రీ, డా. భాగ్యశ్రీ, డా. కవిత, డా. మౌనిక, సూపర్‌వైజర్లు, పలువురు ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ (థామస్‌రెడ్డి) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మణ్‌గౌడ్‌ కోరారు. ఈ మేరకు గురువారం మహబూబ్‌నగర్‌ డిపో అసిస్టెంట్‌ మేనేజర్లు కవిత, జయరాంలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి అన్నివిధాల క ట్టుబడి ఉన్నామన్నారు. కొ త్తగా ఎన్నికై న తమ యూనియన్‌ డిపో కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.కె.రెడ్డి, ముజీబ్‌, టి.ఆర్‌.సి. శేఖర్‌రె డ్డి, తెల్కపల్లి రాములు, హబీబ్‌ హసన్‌, చంద్రమోహన్‌, నిజామాబాద్‌ శ్రీనివాస్‌, ప్రేమలత, అమరేశ్వరి, రాగిణి, శిరీష, శ్రీదేవి, పద్మ పాల్గొన్నారు.

నేడు రాష్ట్రస్థాయి గోగేమ్‌ క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ గోగేమ్‌ క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మాస్టర్‌ మైండ్స్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు మహ్మద్‌ షకీల్‌ అహ్మద్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, జిరాక్స్‌ కాపీలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తీసుకురావాలని కోరారు. మిగతా వివరాల కోసం 98857 04173, 98852 42848 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement