పాన్‌గల్: క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో జిల్లాకేంద్రంలో ఈ నెల 10న నిర్వహించే జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు రేగిచెట్టు నిరంజన్ పిలుపునిచ్చారు. మంగళవారం సీఐటీయూ మండల కన్వీనర్ సూర్యవంశం రాము అధ్యక్షతన నిర్వహించిన మండల సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న జైల్‌భరోలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయా సంఘాల నాయకులు దేవేందర్, జంబులయ్య, భాస్కర్, శ్యామల, మహేశ్వరి, రేణుక, సుజాత, లక్ష్మి, సుగ్రీవుడు, డీవైఎఫ్‌ఐ మండల కన్వీనర్ కమలాకర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు కేజీబీవీ విద్యార్థి ఎంపిక
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న కోట్ల నందిని రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రత్యేక అధికారి లలిత, పీఈటీ చిట్టి తెలిపారు. ఈ నెల 1న జిల్లాకేంద్రంలో జరిగిన ఎంపికల్లో అండర్ 18 విభాగం వెయ్యి మీటర్ల పరుగుపందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిందని.. ఈ నెల 7న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరుఫున పాల్గొంటుందని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిని ప్రత్యేక అధికారి, పీఈటీతో పాటు గ్రామపెద్దలు ఆగారం ప్రకాష్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.
పశువుల సంత @ రూ.1.94 లక్షలు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని పశువుల సంత రూ.1.94 లక్షలు పలికింది. మంగళవారం పుర కార్యాలయంలో చైర్‌పర్సన్ అధ్యక్షతన బహిరంగ వేలం నిర్వహించగా ముగ్గు రు పాటదారులు పాల్గొన్నారు. సర్కార్ పాటను రూ.1.40 లక్షల పైచిలుకుతో పుర అధికారులు ప్రారంభించగా.. గుజ్జుల భరత్ రూ.1.94 లక్షలు పాడి దక్కించుకున్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ ఎం.మాధవి, కమిషనర్ నిరంజన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


