శ్లాబ్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

శ్లాబ్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట గ్రామంలో ఓ ఇంటి శ్లాబ్‌పై పనిచేస్తున్న తాపీ పని కార్మికుడు పెందుర్తి పైడిరాజు (47) ప్రమాదవశాత్తు జారి నేలపై పడి మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ సంఘటనలో శ్లాబ్‌ పైనుంచి కిందకు పడి తీవ్ర గాయాలపాలైన పైడిరాజును వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు పైడిరాజు గుర్ల మండలం గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ సంఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement