బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

విజయనగరం అర్బన్‌/రాజాంసిటీ: యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగులు శుక్రవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం, రాజాంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. తమ డిమాండ్లను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. 5 రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని, వివక్షతో కూడిన పీఎల్‌ఐ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకింగ్‌ నిర్ణయాలను యూనియన్లతో చర్చించిన తర్వాతే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యుఎఫ్‌బీయూ కన్వీనర్‌, కో ఆర్డినేషన్‌ కమిటీ ప్రెసిడెంట్‌, ఎస్‌వీఐ రీజనల్‌ సెక్రటరీ, ఇతర సంఘాల, బ్యాంకుల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

విజయనగరంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement