రామభద్రపురం: మండలకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని విజయనగరం వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది, దీంతో అప్పటికే విద్యుత్ సరఫరా అవుతున్న స్తంభం పక్కకు ఒరిగిపోయి ఆ పక్కనే ఉన్న బట్టల షాపు బోర్డు మీద పడి అలా ఉండిపోయింది.బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీ కొట్టిన వెంటనే పక్కకు తప్పించి దూరంగా తీసుకెళ్లి నిలిపాడు. ఆ సమయంలో ఆక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపేశారు.ఏ మాత్రం స్తంభంతో పాటు వైర్లు కింద పడినా అదే సమయంలో బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. అలాగే బట్టల దుకాణాం షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం తప్పింది. మరో వైపు రోడ్డుపై రాకపోకలు సాగించే పాదచారులు,వాహనాలకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో హమ్మాయ్యా ఏ దేవుడు రక్షించాడో అంటూ అంతా ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్ శాఖాధికారులు వెంటనే స్పందించి కొత్త స్తంభం ఏర్పాటు విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.


