నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు
● మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలు
కురుపాం: సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం విక్రయాలు చేసినా, సరఫరా చేసినా అటువంటి వ్యాపారుల పైన, వ్యక్తుల పైన చర్యలు తప్పవని కురుపాం ఎకై ్సజ్ శాఖ సీఐ పి.శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు సోమవారం సాక్షి దిన పత్రికలో ‘ధాన్యం ముసుగులో నల్లబెల్లం అక్రమ రవాణా’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన సీఐ పి.శ్రీనివాసరావు కురుపాం మండల కేంద్రంలోని రావాడ కూడలి, శివ్వన్నపేట తదితర దుకాణాల్లో సోమవారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా బెల్లం నిల్వల పై ఆరా తీశారు. ఇకపై బెల్లం దిగుమతి ఏ మేరకు చేపడుతున్నది తమకు 15 రోజులకు ఒకసారి తెలియజేయాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఇప్పటి వరకు బెల్లం సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశామని మరో 14 మంది పై బైండవర్ కేసులు నమోదు చేసి వారి నుంచి రూ45 వేల అపరాధ రుసుం వసూలు చేసినట్లు తెలిపారు. సారా నిర్మూలనే లక్ష్యంగా చేపడుతున్న దాడుల్లో పట్టుబడిన వారిని, వారికి బెల్లం సరఫరా చేసేవారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు


