జిల్లా అధికారుల టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ
విజయనగరం అర్బన్: జిల్లా అధికారుల తరఫు న ముఖ్యప్రణాళిక అధికారి బాలాజీ రూపొందించిన టేబుల్ క్యాలెండర్‌ను కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిపాలనలో సమన్వయం, ప్రణాళికాబద్ధమైన పనితీరుకు ఈ క్యాలెండర్ దోహద పడుతుందని చెప్పారు. జిల్లాలో చేపట్టబోయే శాఖాపరమైన కార్యక్రమాలు, తేదీలు, ప్రభుత్వ ప్రాధా న్యతలను క్యాలెండర్‌లో గుర్తించి, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విజయనగరం అర్బన్: సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న వివిధ కేడర్ సిబ్బంది అందరూ హాజరును బయోమెట్రిక్ విధానంలోనే నమోదు చేయా లని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కార పరిస్థితులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి రెవె న్యూ వినతుల్లో ఎక్కువ శాతం తిరస్కారం అవుతున్నాయని, ప్రతి వినతిని మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. అర్జీదారుల వినతులు నాణ్యమైన, స్పీకింగ్ ఆర్డర్ రూపంలో సమాధానం ఇవ్వాలని, అర్జీదారుల సంతృప్తి పెరగాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని, ప్రస్తుతం నూర్చిన ధాన్యం 30వేల మె ట్రిక్ టన్నుల వరకు ఉన్నాయని, బుధవారం మొ త్తం ధాన్యాన్ని సేకరించాలని తెలిపారు. పదో తరగ తి పరీక్షలపై దృష్టి పెట్టాలని, 100 రోజుల ప్రణాళిక అమలు చేసి శతశాతం ఫలితాలు వచ్చేలా చూడాల ని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో మురళి, జిల్లా అధికారులు, వర్చువల్‌గా ఆర్డీఓలు, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణసాధనకు రైతు లంతా కలిసి రావాలని జంఝావతి సాధనసమితి అధ్యక్ష, కార్యదర్శులు చక్క భాస్కరరావు, మరిశర్ల మాలతీకృష్ణమూర్తి నాయు డు కోరారు. గరుగుబిల్లి మండలంలోని ెఉల్లిభద్ర, దళాయివలస, ఉద్దవోలు, శివరాంపురం తదితర గ్రామాల్లో పర్యటించి రైతులు, పెద్దలతో కలిసి మాట్లాడారు. సమస్యపై చర్చించి కరపత్రాలు అందజేశారు. జంఝా వతి ప్రాజెక్టును పాలకులు ఎన్నికల హామీగానే చూస్తున్నారే తప్ప పూర్తిచేసేందుకు శ్రద్ధ వహించడం లేదన్నారు. సాగునీరు అందక, పంటలు పండక ఈ ప్రాంత రైతులు పేదరికాన్ని అనుభవిస్తున్నారన్నారు. రైతులు ప్రశ్నించడంలేదనే సాకుతో పాలకులు పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతులు ప్రశ్నించినప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. జంఝావతి నిర్మాణం పూర్తికోసం బాధిత గ్రామాల రైతులతో సమితులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అక్రమంగా అరటిచెట్ల నరికివేత
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని బిత్రపాడు గ్రామానికి చెందిన నీరసం చంద్రకళ అనే మహిళా రైతుకు చెందిన అరటి తోటలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు యాభై అరటి గెలలతో ఉన్న చెట్లు నరికివేశారు. దీనిపై కొమరాడ ఎస్సై కె. నీలకంఠానికి ఫిర్యాదు చేశారు.
జిల్లా అధికారుల టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ
జిల్లా అధికారుల టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ
జిల్లా అధికారుల టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ


