పదవి కోసం వల..!
మత్స్యకార సహకార సంఘం పదవి కోసం టీడీపీ నేతల అడ్డదారులు జిల్లా అధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు ఆపసోపాలు రంగంలోకి దిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ప్రత్యేక శిబిరాలు.. ప్రలోభాలు.. బెదిరింపులలో బిజీబిజీ నేడు జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడి ఎన్నిక
సాక్షిప్రతినిధి, విజయనగరం:
ప్రజాస్వామ్యయుతమైన అధికారం,కోరంలో బలం లేకపోయినా మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు.. పంచాయతీలను కేవలం అధికార బలంతో చేజిక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు నేడు మత్స్యకార సహకార సంఘాల ఎన్నికల్లోనూ అదే విధానం అవలంబిస్తోంది. విజయనగరం జిల్లాలోని మత్స్యకార సహకార సంఘానికి సంబంధించి పలు సొసైటీల డైరెక్టర్లు, సంఘాల సభ్యులు ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో కొనసాగుతూ పార్టీ తరఫున పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ పదవులను లాక్కునేందుకు టీడీపీ.. జనసేన నాయకులు అడ్డదారులు తొక్కు తున్నారు. గత వారం రోజులుగా మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు, చోటా నేతలు గ్రామాల్లోకి దిగిపోయి సొసైటీ నేతలను ప్రలోభపెడుతున్నారు. అధికారం తమది కాబట్టి తమతో ఉంటే అభివృద్ధి ఉంటుందని నమ్మబలుకుతున్నారు. లొంగనివాళ్లని బెదిరిస్తున్నారు. ప్రత్యేకంగా శిబిరాలుపెట్టి వారిని తమ దారిలోకి తెచ్చేందుకు చేస్తున్న విశ్వప్రయత్నాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
నేడు జిల్లా మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడి ఎన్నిక
విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాగానే జిల్లా మత్సకార సహకార సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు మత్సశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయగా.. ఈ నెల 30న మంగళవారం జిల్లా సంఘం అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం అధికారిక లెక్కల ప్రకారం 66 మంది మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో 44 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 22 మంది అధ్యక్షులుగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను ప్రచరించేశారు. వీరంతా సోమవారం జరిగే ఎన్నికల్లో 11
లంగా ఉండే వారిని ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నారు. గడిచిన పక్షం రోజులుగా పార్టీ జిల్లా నేత గ్రామాల్లో ఉండే నాయకులతో మంతనాలు నిర్వహించి వారి ద్వారా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులను తమదారిలోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు సైతం సమీక్షలు నిర్వహించి ఎన్నిక ల్లో విజయం కోసం ఆరాటపడుతున్నారు. ప్రాథమి క సహకార సంఘాల అధ్యక్షులు తాము చెప్పినట్లు చేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నా రు. ప్రత్యేక క్యాంప్‌లు పెట్టి మాట వినిని వారిని బుజ్జగిస్తున్నారు.
మంది డైరెక్టర్లను ముందుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్లుగా ఎన్నికై న వారంతా వారిలోనే ఒక అధ్యక్షుడిని, ఒక ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్టు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక...
జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుని ఎన్ని క ప్రక్రియ చేతులు ఎత్తే విధానంలో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఇదే సువర్ణావకాశంగా భావించిన అధికార టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు, నాయకులు సంఘం అధ్యక్షుడిగా తమకు అనుకూ
వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 66 మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో అధిక శాతం మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే. గడిచిన రెండు ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన వారు సైతం వైఎస్సార్‌సీపీలో ఉన్న వారే. సదరు వ్యక్తి పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండడంతో మింగుడు పడని టీడీపీ, జనసేన నాయకులు జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకుని, వారి ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో చాలా మంది గ్రామాల్లో నెయ్యిల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, వారి ఆర్ధిక, సామాజిక స్థితి గతులు అంతంతమత్రంగానే ఉండటంతో వారిని అధికార బలంతో బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిని సంబందిత సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.


