పెన్షన్ డబ్బులు మాయంపై ఫిర్యాదు
సంతకవిటి: మండలంలోని మండాకురిటి సచివాలయంలో పెన్షన్ అమౌంట్ నుంచి రూ.50 వేలు మాయం కావడంపై కార్యదర్శి సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం పెన్షన్‌లు పంచేందుకు సోమవారం సిరిపురం యూనియన్ బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన రూ.33 లక్షల 45 వేల 500ను విలేజ్ సర్వేయర్ సచివాలయానికి తీసుకువచ్చి కార్యదర్శికి అందించారు. అనంతరం క్లస్టర్ వైజ్ పంచగా అందులో రూ.50 వేలు మాయమైయినట్లు గుర్తించారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
బెంగళూరులో యువకుడి మృతి
గుర్ల: మండలంలోని గొలగాం గ్రామానికి చెందిన కంది సాయిరాం(26) బెంగళూరులో మృతి చెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు సాయిరాం బెంగళూరులోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వస్తుండగా బెంగళూరులో జరిగిన రైల్వే ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు సమాచారం అందించారని చెప్పారు.


