ధాన్యం ముసుగులో నల్లబెల్లం..!
● ఒడిశా నుంచి ఆంధ్రాకు దిగుమతి
● బయట ధాన్యం బస్తాలు..లోపల నల్ల బెల్లం
● సారా తయారీలో నల్లబెల్లం వినియోగం
కురుపాం: కొన్ని సినిమాలు ఆదర్శంగా నిలుస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలను వివరిస్తాయి.. మరి ఏది ఆదర్శంగా తీసుకున్నారో కానీ కొంతమంది వ్యాపారులు సారా తయారీకి అవసరమయ్యే నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుంటున్నారు. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం స్థానికంగా పుష్కలంగా లభిస్తుండడం.. అది ఎక్కడ నుంచి తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ఓ సినిమాలో హీరో బయటకు సక్రమంగాను.. లోపల అక్రమంగాను సరుకులు తరలిస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. సరిగ్గా ఇదే పంథాను స్థానిక వ్యాపారులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతుండడంతో వ్యాపారులు ధాన్యం మాటన నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి తీసుకువస్తున్నారు.ఈ బెల్లాన్ని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాలకు చెందిన సారా తయారీ దారులు కొనుగోలు చేస్తున్నారు.
అక్రమార్కులకు వేగులుగా సిబ్బంది..?
ఈ అక్రమ రవాణాకు కొంతమంది ఎకై ్సజ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యాపారులకు ఎకై ్సజ్ సిబ్బందే వేగులుగా పనిచేస్తుండడంతో బెల్లం రవాణాను, సారాను అర్టికట్టలేకపోతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎకై ్సజ్ శాఖ కురుపాం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. ఇకపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామన్నారు.
ధాన్యం ముసుగులో నల్లబెల్లం..!


