ఎట్టకేలకు పట్టుబడిన దొంగలు
● 12 తులాల బంగారం,
రెండు సెల్‌ఫోన్‌లు రికవరీ
లక్కవరపుకోట: పోలీసులకు సవాల్‌గా మారిన దొంగతనాలను ఎట్టకేలకు ఛేదించి ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి 12 తులాల బంగారం ,రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను సీఐ ఎల్.అప్పలనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల ముందు హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. అరకు–విశాఖపట్నం రోడ్డులో ఎస్సై సీహెచ్.నవీన్‌పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అదే దారిలో వస్తున్న ఆటోలోంచి ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని విచారణ చేయగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కోట్నివానిపాలెం గ్రామానికి చెందిన ఉప్పలూరి ఉదయ్‌భాస్కర్ అలియాస్ బాలు, అదే జిల్లా కై లాసపురం, సాలిగ్రామపురానికి చిరత శివలుగా తేలింది. వారిద్దరూ కొంత బంగారం తీసుకుని ఆరకు, అనంతగిరి ప్రాంతాల్లో అమ్మేందుకు వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఆ ఇద్దరు నిందితులు లక్కవరపు కోట మండలంలోని గోల్డ్‌స్టార్ జంక్షన్‌లో జూలై 2023లో, అలాగే శ్రీరాంపురం గ్రామంలో ఆగస్టు2024లో ఇళ్లలో పట్టపగలే చొరబడి కిటికీ ఊచలు వంచి దొంగతనాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.


