చెదిరిన బతుకులు
మూతబడిన
జిందాల్
స్టెయిన్‌లెస్
లిమిటెడ్
కర్మాగారం
కరాల సత్తువ..నరాల బిగువూ ఉన్నంతకాలం స్వేదం చిందించి పరిశ్రమ ఉన్నతి కోసం పనిచేసిన కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలో పనికి అలవాటు పడి మరో పని చేతకాక..అర్ధాంతరంగా రోడ్డున పడిన బతుకులను చూసి మనోవ్యధ చెందుతున్నారు. కుటుంబాలను పోషించలేక..వేరే దారి లేక..ఏవో చిన్నచిన్న పనులు చేసుకుంటూ తలో దిక్కుకు చెదిరిపోయి కుటుంబ నావను ఈడ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదీ జిందాల్ కర్మాగారం మూసివేసిన తరువాత అందులో పనిచేసిన కార్మికుల దుస్థితి.


