15 టన్నుల అక్రమ పేలుడు పదార్థాలు ధ్వంసం
వేపాడ: మండలంలోని వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతుల్లేకుండా రవాణా చేస్తూ పట్టుబడిన పేలుడు పదార్థాలను అత్యంత భద్రతా చర్యలతో పోలీసులు శుక్రవారం నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2018లో రాతి క్వారీలకు ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జికోర్టు ఉత్తర్వుల మేరకు బాంబ్ స్కాడ్ టీమ్ ఎక్స్‌పర్ట్స్ ఆధ్వర్యంలో ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్, ఇద్దరు వీఆర్‌ఓలు, పోలీసు సిబ్బంది సమక్షంలో కరకవలసగ్రామంలో ఎవరూ సంచరించని ప్రదేశంలో 15000 కేజీల అక్రమ పేలుడు పదార్థాలను ధ్వంసం చేశారు.
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకు పోలేరని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సీ్త్రశిశు,గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్‌పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు తదితర విషయాలపై మంత్రి సంధ్యారాణి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైఎస్సార్‌సీపీ నుద్దేశించి మాట్లాడిన మాటలపై రాష్ట్ర వైఎస్సార్‌సీపీ లీగల్ టీమ్ పరిశీలించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సాలూరు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. బాధితురాలు ముందుగా మీడియాతో మాట్లాడిందని, అదే బాధితురాలు ఎస్పీకి లిఖిత పూర్వకంగా కంప్లెయింట్ ఇచ్చి పార్వతీపురంలో మీడియాతో మాట్లాడి మెజిస్ట్రేట్ ముందు కూడా స్టేట్‌మెంట్ ఇచ్చిందని చెప్పారు. ఈ వ్యవహారంలో సతీష్ అరెస్ట్ కాకుండా ఉండాలనే రాజకీయ ఒత్తిళ్ల వల్లనే బెయిలబుల్ సెక్షన్‌లు పెట్టారని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు.


