ఏనుగులతో భీతిల్లుతున్న ప్రజలు
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో సంచరిస్తున్న ఏనుగులు శుక్రవారం ఉదయానికి గరుగుబిల్లి మండలంలోని సుంకి గ్రామంలో ప్రత్యక్షమయ్యాయి. ఈ మేరకు ఎస్‌డబ్యూపీసీలోని స్తంభాలను ధ్వంసం చేసి చిందరవందర చేశాయి. గజరాజులతో ఇప్పటికే వివిధ గ్రామాల్లో ధన, ప్రాణనష్టం జరిగినప్పటికీ ఏనుగులను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంంతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రధాన రహదారి సమీపంలో ఏనుగులు సంచరిస్తుండడంతో వాహనచోధకులు రాకపోకలు చేసేందుకు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పొలం పనులు ముమ్మరంగా ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకముందే ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


