అంతర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ పోటీల విజేతలు వీరే.. | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ పోటీల విజేతలు వీరే..

Jul 19 2026 1:08 AM | Updated on Jul 19 2026 1:08 AM

విశాఖ స్పోర్ట్స్‌: 11వ రాష్ట్ర అంతర్‌ జిల్లాల సబ్‌జూనియర్‌, జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ శనివారం విశాఖలోని అక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభమైంది. జిల్లా స్విమ్మింగ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సబ్‌ జూనియర్‌, జూనియర్‌ బాలబాలికలకు ఫ్రీస్టైల్‌, బ్యాక్‌స్ట్రోక్‌, బ్రెస్ట్‌స్ట్రోక్‌, బటర్‌ఫ్లైతో పాటు మెడ్లే విభాగాల్లో పోటీలు నిర్వహించారు. వివిధ వయో విభాగాల్లో 50 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు జరిగిన పోటీల్లో విజేతలను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయగా, రన్నరప్‌గా నిలిచిన వారిని స్టాండ్‌బై క్రీడాకారులుగా ఎంపిక చేశారు.

వ్యక్తిగత చాంప్‌లు మాన్విత, చరిత్‌

మాన్విత, చరిత్‌,మణికంఠ,లాస్య వ్యక్తిగత చాంపియన్లుగా నిలిచారు. ఎం.రామ్‌ మణికంఠ(ఎన్టీఆర్‌)కె.లాస్యశ్రీ(బాపట్ల),వి.చరిత్‌ఆదిత్య(కృష్ణా) 35 పాయింట్లతోనూ, ఎస్‌.మాన్వితసాయి(విశాఖ)33 పాయింట్లతోనూ సత్తాచాటి స్వర్ణాలతో పాటు వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లను కై వసం చేసుకున్నారు.

ప్రధాన విజేతలు

కేటగిరీ–3 (100 మీటర్లు)

బ్రెస్ట్‌స్ట్రోక్‌ (బాలురు): సాయిచరణ్‌ (కాకినాడ)

బ్రెస్ట్‌స్ట్రోక్‌ (బాలికలు): ఎస్‌. అనన్య (విశాఖ)

బటర్‌ఫ్లై (బాలురు): చరిత్‌ ఆదిత్య (కృష్ణా)

బటర్‌ఫ్లై (బాలికలు): సమన్విత (విశాఖ)

బ్యాక్‌స్ట్రోక్‌ (బాలురు): చరిత్‌ ఆదిత్య (కృష్ణా)

బ్యాక్‌స్ట్రోక్‌ (బాలికలు): జాహ్నవి (అనంతపురం)

కేటగిరీ–2

50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ (బాలురు): షణ్ముఖ్‌వీర్‌ (కాకినాడ)

50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ (బాలికలు): అనన్య (విశాఖ)

100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ (బాలురు): స్వామినాయుడు (ఏలూరు)

100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ (బాలికలు): అనన్య (విశాఖ)

బటర్‌ఫ్లై (బాలురు): రామ మణికంఠ (ఎన్టీఆర్‌)

బటర్‌ఫ్లై (బాలికలు): యానా జైన్‌ (ఎన్టీఆర్‌)

400 మీటర్ల ఫ్రీస్టైల్‌ (బాలికలు): లాస్యశ్రీ (బాపట్ల)

కేటగిరీ–1బి

50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ (బాలురు): గౌతమ్‌ (గుంటూరు)

50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ (బాలికలు): లిపి (ఎన్టీఆర్‌)

50 మీటర్ల ఫ్రీస్టైల్‌ (బాలురు): వెంకట నాగసాయి (గుంటూరు)

50 మీటర్ల ఫ్రీస్టైల్‌ (బాలికలు): లాస్యశ్రీ (ఎన్టీఆర్‌)

బ్యాక్‌స్ట్రోక్‌ (బాలురు): కార్తీకేయ (వైఎస్‌ఆర్‌ కడప)

బ్యాక్‌స్ట్రోక్‌ (బాలికలు): అవిఘ్న (బాపట్ల)

కేటగిరీ–1ఎ

100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ (బాలురు): కార్తీకేయ (అనంతపురం)

100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ (బాలికలు): ప్రీతి (విశాఖ)

ఫ్రీస్టైల్‌: కేటగిరీ–1, 1500 మీటర్లు (బాలురు): హర్షవర్ధన్‌ (బాపట్ల)

కేటగిరీ–1, 400 మీటర్లు (బాలురు): రోహన్‌ శ్రీవాస్తవ్‌ (శ్రీకాకుళం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement