విశాఖలో డేటా సెంటర్ల పేరుతో కొండలను తవ్వేస్తూ, చుట్టుపక్కల అడవులను నరికివేయడం తీవ్ర ఆందోళనకరం. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల కంబాలకొండ ఎకో ఫారెస్ట్, వన్యప్రాణి అభయారణ్యాల ఉనికికే ప్రమాదం వాటిల్లుతోంది. దీని ప్రభావంతో ముడసర్లోవ జలాశయం, స్థానిక నీటి వనరులు తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పర్యావరణానికి ఇంతటి ముప్పు తెచ్చే ఈ డేటా సెంటర్‌ను అమరావతికి మార్చడం ఎంతో ఉత్తమం. –దీక్ష
ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలి
మనుషులు, పర్యావరణం మధ్య ఉన్న బంధం విడదీయరానిది. ఈ సమతుల్యత దెబ్బతింటే దాని ప్రభావం ప్రజల జీవనంపై తీవ్రంగా పడుతుంది. ప్రకృతి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలి. విశాఖపట్నం పర్యావరణం, సహజ వారసత్వాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
–రాజా రామ్మోహన్ రాయ్, గ్రీన్ విశాఖ


