నిబంధనల ప్రకారం ఉద్యోగుల బదిలీలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారం ఉద్యోగుల బదిలీలు

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

మహారాణిపేట: రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు నిబంధనల ప్రకారమే జరుగుతుందని, ఉద్యోగులు ఎలాంటి అపోహలకు లోనుకావాల్సిన అవసరం లేదని ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎస్‌. సత్తిబాబు తెలిపారు. ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మినిస్టీరియల్‌, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సీనియారిటీ జాబితాల్లో లోపాలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేస్తామని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు విధానంపై ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామరాజు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు పాల్గొని, నిర్ణీత గడువులోపు ఆప్షన్‌ ఫారాలు సమర్పించాలని ఉద్యోగులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement