
బీజేపీ నేతల ముందస్తు అరెస్టు
కొడంగల్ రూరల్: బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సేవ్ హైదరాబాద్‌లో భాగంగా సచివాలయ ముట్టడికి తరలుతున్న నాయకులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా వెళుతున్న తమని అరెస్టు చేయడం అన్యాయమని పలువురు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో గంటి సర్వేష్‌కుమార్, కరాటే శ్రీనివాస్, సాయికుమార్, అరుణ్, అనిల్ తదితరులున్నారు.
బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి
దోమ: అక్రమ అరెస్టుతో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన పథకాలను ఆపలేరని బీజేపీ మండల అధ్యక్షుడు బొంగు మల్లేశ్ మండిపడ్డారు. శుక్రవారం మండలం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు చలో సచివాలయానికి వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారన్నారు. ఇప్పటికై నా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్నారు. లేని పక్షంలో గ్రామాలలో ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వాలి
పూడూరు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సినిమా సెన్సార్‌బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేవైఎం పూడూరు మండల అధ్యక్షుడు నవీన్‌జోషి, జిల్లా కార్యవర్గ సబ్యుడు శ్రీశైలం, బూత్ అధ్యక్షులు సత్యనారాయణ, జంగయ్యలను అరెస్టు చేసి చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్రమ అరెస్టులు అన్యాయం
దౌల్తాబాద్: హైదరాబాద్‌లో సచివాలయ ముట్టడికి బయలుదేరుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ హైదరాబాద్‌లోని సెక్రెటరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందుకు ముందస్తుగా నాయకులను అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు అశోక్, నేతలు సములప్ప, సురేష్, మొహన్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులున్నారు.
అరెస్ట్‌లు అప్రజాస్వామికం
కుల్కచర్ల: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండకట్టేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం అప్రజాస్వామికమని పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాటన్‌పల్లి అంజిలయ్య అన్నారు. శుక్రవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పిలుపు మేరకు చలో సచివాలయ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని అన్నారు. వెంటనే బీసీ రిజర్వేషన్ల ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.

బీజేపీ నేతల ముందస్తు అరెస్టు

బీజేపీ నేతల ముందస్తు అరెస్టు

బీజేపీ నేతల ముందస్తు అరెస్టు

బీజేపీ నేతల ముందస్తు అరెస్టు