
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
దుద్యాల్: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మలేరియా, పైలేరియా ప్రత్యేక అధికారి ఫకీరప్ప అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కేజీబీవీలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ముసురు వర్షాల కారణంగా బ్యాక్టీరియా వ్యాప్తి చెంది దోమలు ప్రబలే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సునీత, కేజీబీవీ ప్రత్యేకాధికారి రాధిక, పాఠశాల సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మలేరియా, పైలేరియా
ప్రత్యేక అధికారి ఫకీరప్ప