
భక్తిశ్రద్ధలతో వీరభద్ర స్వామి జయంతి
కొడంగల్ రూరల్: పట్టణంలోని వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం వీరశైవ సమాజం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఆలయ పురోహితులు మడపతి జగదీష్‌స్వామి సమక్ష్యంలో వీరభద్రేశ్వరస్వామివారికి, భద్రకాళి అమ్మవారికి శివలింగానికి పంచామృతంతో అభిషేకం, విశేష అలంకరణ, దూప, దీప, నైవేద్యం సమర్పించారు. భక్తులు ఖడ్గాలు వేస్తూ స్వామివారిని వేడుకున్నారు. అనంతరం మంగళహారతులు ఇచ్చి స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం పట్టణ అధ్యక్షుడు జంగం శాంతుకుమార్, ఉపాధ్యక్షుడు బుక్క విజయకుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖరస్వామి, బొంరాస్‌పేట మండల సంఘం గౌరవ అధ్యక్షుడు జగదీష్‌స్వామి, గడ్డం అఖిలేశ్వర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.