
న్యాయవాదుల విధుల బహిష్కరణ
అనంతగిరి: న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్ డిమాండ్ చేశారు. కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఈసీ మెంబర్ అడ్వకేట్ తన్నీరు శ్రీకాంత్‌పై సోమవారం దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం వికారాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బస్వరాజ్ పటేల్ మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులంతా ఏకతాటిపైకి వచ్చి చట్టం చేసే వరకు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పోలీస్ వెంకట్‌రెడ్డి, న్యాయవాదులు కమాల్‌రెడ్డి, లవకుమార్, గోవర్ధనరెడ్డి, గోపాల్‌రెడ్డి, యాదవరెడ్డి, సంపూర్ణనంద్, శంకరయ్య, మాధవరెడ్డి, . శుక్లవర్ధన్ రెడ్డి, మహ్మద్ రఫీ, అశోక్ కుమార్, శుభప్రద్ పటేల్, ఆనంద్ గౌడ్, గోపాల్, రాజశేఖర్ మోహన్ రాజు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.