
అప్పు ఇప్పిస్తామని భూమికి ఎసరు
కుల్కచర్ల: రైతు తెలియకుండానే భూమిని విక్రయించిన ముగ్గురు మధ్యవర్తులను మంగళవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ రమేశ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన రైతు కావలి పాండుకు సర్వే నంబర్ 287, 289లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సదరు రైతుకు ముగ్గురు మధ్యవర్తులు మనోజ్‌కుమార్, గణేశ్, మురళి నాయక్ రూ.2 చొప్పున రూ.5లక్షల అప్పు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలో పాండుకు చెందిన 1.16ఎకరాల భూమిని షాద్‌నగర్‌కు చెందిన దేవిరెడ్డి రత్నమ్మకు రిజిస్ట్రేషన్ చేయించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన రైతు ఫిబ్రవరి 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి రైతును మోసం చేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందుతులను పరిగి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.
ముగ్గురు నిందితుల రిమాండ్