సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

Aug 27 2025 9:47 AM | Updated on Aug 27 2025 9:47 AM

సంస్క

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

కొడంగల్‌: మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న భారత్‌ పెట్రోల్‌ పంప్‌

మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రియదర్శిని తదితరులు

అనంతగిరి: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల తదితరులు

అనంతగిరి: మట్టి వినాయకులను పూజిద్దామని వికారాబాద్‌ మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల రమేష్‌కుమార్‌ అన్నారు. పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. వికారాబాద్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మాలె లక్ష్మణ్‌గుప్తా, కార్యదర్శి యాస్కి సునీల్‌, ఉపాధ్యక్షుడు రఘునందన్‌, కోశాధికారి దోమ శ్రీకాంత్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు మ్యాడం లక్ష్మి పలువురు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఏసీఆర్‌ విద్యాసంస్థ..

వికారాబాద్‌లోని ఏసీఆర్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు.

మట్టి వినాయకులను పూజించాలి

కొడంగల్‌ రూరల్‌: పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు కె మురహరి వాసిష్ట అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీవిద్య స్కూల్లో, కేశవస్వామి ఆలయంలో లయన్స్‌క్లబ్‌ సభ్యులతో కలిసి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వడ్డె భీమరాజ్‌, డాక్టర్‌ సాకేత్‌, మిఠాయి రాజేందర్‌, దామోదర్‌రెడ్డి, శ్రీశైలం, మునీర్‌, మాజీ ఉప సర్పంచు ఎస్‌ఎం గౌసన్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి

కొడంగల్‌: ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని అందుకు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఫిల్లింగ్‌ స్టేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రియదర్శిని కోరారు. పట్టణ శివారులోని కోస్గి రోడ్‌లోని భారత్‌ పెట్రోల్‌ పంపు ఆవరణలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయాలి

ధారూరు: గురువుల మార్గదర్శనంతో కుక్కింద ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకులను తయారుచేసి అబ్బురపర్చారు. నేషనల్‌ గ్రీన్‌ క్రాప్స్‌, ఈకో ఫ్రెండ్లీ గణేశ్‌ ప్రొగ్రాంలో భాగంగా జీహెచ్‌ఎం, ఉపాధ్యాయులు మట్టి వినాయకులను తయారు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్‌ఓ విశ్వేశ్వర్‌ మాట్లాడుతూ నేషనల్‌ గ్రీన్‌ క్రాప్స్‌ అనేది పాఠశాల పరిశుభ్రత, పచ్చదనంతో పాటు విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపయోగపడుతుందన్నారు. పాఠశాల జీహెచ్‌ఎం చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బంకమట్టి నుంచి ఈకో ఫ్రెండ్లీ గణేశ్‌లను తయారు చేసిన విద్యార్థుల ప్రతిభ అమోఘన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ గ్రీన్‌ క్రాప్స్‌ ఇన్‌చార్జి కమాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు గుణవంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సుజాత, రాజశేఖర్‌, జగదీశ్వర్‌, సంతోష, శివప్రసాద్‌, యాకాంతం తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు

వినాయక చవితి సందర్భంగా ఊరూరా గణనాథులు కొలువుదిరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా గణనాథులను స్మరించుకుంటూ ఆయా మండపాలకు తరలిస్తున్నారు. ఈ సారి పలు భిన్న ఆకృతుల్లో విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మండపాల తయారీకి అవసరమైన డెకరేషన్‌ సామగ్రి, పూజా వస్తువులతో దుకాణాలు కిటకిటలాడాయి. ఆయా ప్రాంతాల్లోని మండపాలను బుధవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు విద్యుద్దీపాలతో అలంకరించారు.

పర్యావరణాన్ని కాపాడుదాం

పరిగి: మట్టి వినాయకులను పూజిద్దం, పర్యావరణాన్ని కాపాడుదామని ఎమ్మెల్యే సతీమణి ఉమారామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మట్టి వినాయకుల పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్లాస్టర్‌ఆప్‌ పారిస్‌తో తయారు చేసిన వినాయకులతో జల కాలుష్యం ఏర్పడుతుందన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక 1
1/2

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక 2
2/2

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement