డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్ యాదవ్
కుల్కచర్ల: విధులు సక్రమంగా నిర్వహించే వారికి గుర్తింపు, గౌరవం లభిస్తుందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్ యాదవ్, కుల్కచర్ల మండల వైద్యాధికారి కిరణ్‌కుమార్ గౌడ్ అన్నారు. గురువారం పీహెచ్‌సీలో పార్మాసిస్టుగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ పదోన్నతిపై గాంధీ ఆస్పత్రికి వెళ్లనుండటంతో ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధ్యతగా పని చేసేవారిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని తెలిపారు. కార్యక్రమంలో వైద్యురాలు మాధురి, వైద్య సిబ్బంది వెంకటేష్, అంజూ, నవీన్, శ్రీను, వినోద్, వెంకటయ్య, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
కళాశాల కిచెన్‌లో పేలిన కుక్కర్
వంట మనిషి, ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
తాండూరు టౌన్: తాండూరు పట్టణంలోని నర్సింగ్ మహిళా కళాశాల కిచెన్‌లో బుధవారం ఫ్రెషర్ కుక్కర్ పేలిన ఘటనలో వంట మనిషితో పాటు ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. పట్టణంలోని పీపీ యూనిట్‌లో కొనసాగుతున్న నర్సింగ్ కళాశాలలో వంట చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో ఫ్రెషర్ కుక్కర్ పేలింది. అక్కడే వంట చేస్తున్న వంట మనిషి, భోజనం వడ్డించుకుంటున్న ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జిల్లా ఆస్పత్రికి మరమ్మతులు చేయండి
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు టౌన్: వర్షాలకు లీకేజీ అవుతున్న తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం మండల అభివృద్ధి అధికారి విశ్వప్రసాద్, పంచాయతీ రాజ్ ఏఈ నందినితో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు ఆపరేషన్ థియేటర్, ఓపీ విభాగాల్లోకి లీకేజీ అవుతుండటాన్ని పరిశీలించారు. రోగులకు ఇబ్బంది లేకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.