
చెరువుల పరిశీలన
షాద్‌నగర్‌రూరల్: గణేశ్ నవరాత్రుల్లో భాగంగా నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ సూచించారు. బొబ్బిలి చెరువు, దూసకల్, బుచ్చిగూడ చెరువులను గురువారం ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మండప నిర్వాహకులకు చెరువులను విభ జించి రూట్ మ్యాప్ ఇవ్వాలని, దాని ప్రకారం నిమ జ్జనాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువుల్లో నీరు నిండుగా ఉందని, నిమజ్జన సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. డీసీపీ వెంట మున్సిపల్ కమిషనర్ సునీత, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రాంచందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ అలీఖాన్‌బాబర్ ఉన్నారు.