
యూరియా సరఫరా కేంద్రాల్లో తనిఖీ
అనంతగిరి: వికారాబాద్‌లోని యూరియా సరఫరా(విక్రయం) చేస్తున్న పీఏసీఎస్ శివారెడ్డిపేట, కిసాన్ ఆగ్రోస్, రైతు ఆగ్రోస్, గుల్షాన్ ఫర్టిలైజర్స్, శ్రీ లక్ష్మీనారాయణ ఏజెన్సీలను జిల్లా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ సందర్భంగా స్థావరాలలో ఉన్న యూ రియా స్టాక్‌ను పరిశీలించారు. ఎంత వచ్చింది.. ఎంత విక్రయించారు.. ఎంత నిల్వ ఉందో అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. వారి వెంట మండల వ్యవసాయాధికారి ప్రసన్నలక్ష్మి తదితరులు ఉన్నారు.
వామపక్షాల పోరాటంతోనే ఉచిత విద్యుత్
అనంతగిరి: ఇరవై ఐదు ఏళ్ల క్రితం వామపక్ష పార్టీలు చేసిన పోరాట ఫలితమే నేడు ప్రజలు అనుభవిస్తున్న ఉచిత విద్యుత్ అని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ జిల్లా ముఖ్య నాయకులు మైపాల్, గోపాల్‌రెడ్డి, మహేందర్ అన్నారు. ఈ మేరకు గురువారం విద్యుత్ పోరాటం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికారాబాద్‌లోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో పోరాట అమరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వీహెచ్‌పీఎస్ జెండా ఆవిష్కరణ
అనంతగిరి: వికలాంగుల హక్కుల పోరాట సమితి 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వికారాబాద్‌లో ఆ సంఘం జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్, నాయకుడు వెంకట్, సోషలిస్టు పార్టీ నాయకురాలు పుష్పరాణి, పద్మమ్మ, సునీత, రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు
బంట్వారం: ఇంట్లో గొ డవపడి మనస్తాపంతో ఓ వ్యక్తి వాగులో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన కోట్‌పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శైలజ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోట్‌పల్లికి చెందిన చాకలి సంగమేశ్వర్(38) ఇంట్లో గొడవపడి బుధవారం మధ్యాహ్నం బయటికి వెళ్లిపోయాడు. ఆయన భార్య లక్ష్మి గమనించి వెంబడించగా సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కోట్‌పల్లి వాగులో దూకాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గురువారం గజ ఈతగాళ్లతో వాగులో గాలింపు చర్యలు చేపట్టిన సంగమేశ్వర్ ఆచూకీ దొరక లేదు. ధారూరు సీఐ రఘురాములు కోట్‌పల్లి వాగును సందర్శించి వివరాలు తెలుసుకున్నా రు. వాగులో అదృశ్యమైన సంగమేశ్వర్ సెంట్రింగ్ పనులతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య లక్ష్మి, ముగ్గురు ఆడపిల్లలున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బొంరాస్‌పేట: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ బాలవెంకటరమణ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాస్నం వెంకటయ్య(36) రెండు వారాలుగా మద్యం తాగుతూ, ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయమై తండ్రి హన్మయ్య అతన్ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటయ్య ఈనెల 24న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని తాండూరు ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

యూరియా సరఫరా కేంద్రాల్లో తనిఖీ

యూరియా సరఫరా కేంద్రాల్లో తనిఖీ

యూరియా సరఫరా కేంద్రాల్లో తనిఖీ

యూరియా సరఫరా కేంద్రాల్లో తనిఖీ